ఆ నిర్మాతతో ఎమెల్యే ఏమన్నాడంటే???

  • January 18, 2017 / 11:46 AM IST

టాలీవుడ్ టాప్ నిర్మాతలు ఎవరు అని అడిగినా…లేదా టాలీవుడ్ నిర్మాతల్లో ఆ నలుగురు ఎవరు అని అడిగిన ఇట్టే గుర్తుకు వచ్చే పేరు మన దిల్ రాజు….దిల్ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుని సినిమా పేరుతను తన ఇంటి పేరుగా మార్చుకున్న దిల్ రాజు, తాజాగా పెద్ద సాహసమే చేశాడు అనే చెప్పాలి…అదే రెండు బడా సినిమాల మధ్య తన సినిమా శతమానంభవతి విడుదల చెయ్యడమే కాకుండా సూపర్ హిట్ కూడా అందుకున్నాడు కదా….అదే క్రమంలో రిలీజ్ రోజు నుండి మంచి మౌత్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది అని చెప్పక తప్పదు….ఇక ఇదే విషయమై మన నిర్మాతకు సాక్షాత్తూ ఒక ఎమెల్యే ఫోన్ చేశాడట.

ఇంతకీ ఎవరా ఎమెల్యే అండ్ ఏమా కధ అంటే మాత్రం మనం ఈ కధ చదవాల్సిందే….నెల్లూరికి చెందిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సినిమా వల్ల పొందిన అనుభూతిని నిర్మాత దిల్ రాజుతో పంచుకున్నారట. సినిమా చూసి ఎలాగైనా సరే దిల్ రాజుతో మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేసి చివరగా నంబర్ పట్టుకుని ఫోన్ చేసి సినిమా అద్భుతంగా ఉందని పావు గంటకు పైగా మాట్లాడారట. కేవలం ఆయనే కాదు తన సన్నిహితులు కూడా చాలామంది మంచి సినిమా తీశావని అన్నారని ప్రమోషన్స్ కార్యక్రమాల్లో దిల్ రాజు తెలిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus