రూమర్లపై స్పందించిన దిల్ రాజు!

  • August 6, 2018 / 12:18 PM IST

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు ముందు వరుసలో ఉంటారు. నిర్మాణంలో నాలుగు సినిమాలు ఉండగా.. ఆయన తాజా చిత్రం “శ్రీనివాస కళ్యాణం” ఈ గురువారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో పాల్గొన్న దిల్ రాజు తన మీద వస్తున్న తాజా రూమర్స్ పై స్పందించారు. దిల్ రాజు తాను నిర్మించే అన్నీ సినిమాల కథ, కథనాల విషయంలో ఇన్వాల్వ్ అవుతారన్న విషయం తెలిసిందే, కానీ.. ఆయన ఇన్వాల్వ్ మెంట్ ఈమధ్య కాస్త ఎక్కువై ఏకంగా కొన్ని సినిమాలకు ఘోస్ట్ డైరెక్టర్ గా వ్యవహరించే స్థాయికి వెళ్లిపోయాడని వార్తలొచ్చాయ్.

సదరు రూమర్లపై దిల్ రాజు కాస్త ఘాటుగానే స్పందించాడు. “నేను సినిమాల కథల విషయంలో ఇన్వాల్వ్ అవుతాను కానీ.. మేకింగ్ టైమ్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను. దర్శకుడికి, నటీనటులకు పూర్తి స్వేచ్చా ఇస్తాను” అంటూ సమాధానమిచ్చారు దిల్ రాజు. అయితే.. గతంలో దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఫ్లాప్స్ విషయంలో తన ఇన్వాల్వ్ మెంట్ వల్లే సినిమాలు ఫ్లాప్ అయ్యాయని దిల్ రాజు పేర్కొనడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus