దిల్ రాజు ఇంట పెళ్ళి సందడి

  • December 18, 2018 / 11:18 AM IST

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఇంట పెళ్ళి సందడి మొదలుకానుందట. దిల్ రాజు సహోదరుడు  హర్షిత్ పెళ్ళి పీటలెక్కబోతున్నట్టు తాజా సమాచారం. రీసెంట్ గా  రాజ్ తరుణ్ ‘లవర్’ సినిమాని నిర్మించాడు హర్షిత్. వివరాల్లోకి వెళితే ఆధోని ఎమ్మెల్యే అయిన వై.సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె గౌతమితో హర్షిత్ నిశ్చితార్ధం ఇటీవలే జరిగిందట.

డిసెంబర్ 21న  గోవాలో వీరి పెళ్ళి  జరుగనుందట. అయితే వీరి పెళ్ళి ఎటువంటి ఆర్బాటం లేకుండా సింపుల్ గా జరుగనుందట. టాలీవుడ్ కు సంబంధించిన దర్శక నిర్మాతలు స్టార్ హీరోలు ఈ పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. పెళ్ళికి కొందరు మిస్సయినా డిసెంబర్ 23న హైదరాబాద్‌లో రిసెప్షన్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారట . ఈ వేడుకకు టాలీవుడ్ తో పాటు రాజకీయ నేతలు కూడా హాజరవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus