మాస్ ప్రేక్షకుల పల్స్ తెలిసిన రైటర్ బాబీ (కె.ఎస్. రవీంద్ర). అతను మాస్ మహారాజ్ రవితేజ “పవర్” సినిమాతో దర్శకుడయ్యారు. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఎంతో కష్టపడి తెరకెక్కించిన “సర్దార్ గబ్బర్ సింగ్” మూవీ ఆశించినంత హిట్ కాలేక పోయింది.
దీంతో మళ్లీ తన టాలెంట్ ని నిరూపించునే పని పడింది. అందుకే బాబీ మంచి కథను రాసి రవితేజకు వినిపించారని… అది మాస్ మహారాజ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. ప్రస్తుతం రవితేజ యంగ్ డైరక్టర్ చక్రిని తన రాబిన్ హుడ్ చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే . తదుపరి బాబీ కథ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషలో మూవీ అనగానే మాస్ సినీ ప్రేక్షకులకు మంచి విందు భోజనమేనని అంటున్నారు సినీ విశ్లేషకులు.