రెండో సినిమాకే దర్శకుడి మార్పు!!!

  • August 17, 2016 / 07:00 AM IST

టాలీవుడ్ లో టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన అక్కినేని కుటుంభం ఎప్పటికప్పుడు తమ అభిమానులకు ఆనందాన్ని పంచే సినిమాలే చేసుకుంటూ వస్తున్నారు. అలనాటి నటసామ్రాట్ నుంచి ఈ నాటి యువ నట సామ్రాట్ అఖిల్ వరకూ అందరూ తమకు నచ్చిన స్టైల్ లో సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. అయితే ఎన్నో అంచనాలు, మరెన్నో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ కలగలిపి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అఖిల్ తొలి సినిమా “అఖిల్”. కధ విని ఈ సినిమా చేశారు…లేక వినకుండా చేసేసారో తెలీదు కానీ, మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ గా మారి అఖిల్ కరియర్ ని సవాల్ లో పడేసింది.

అయితే ఎంతో సమయం తీసుకుని మరో కధతో, హాను రాఘవపూడీ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు అఖిల్. ట్విటర్ ద్వారా తన అభిమానులకు ఏ విషయాన్ని కూడా తెలియజేసాడు. ఏమయిందో ఏమో ఇప్పుడు హాను ను తప్పించి ఆ స్థానంలో అక్కినేని కుటుంబానికి ‘మనం’లాంటి మంచి చిత్రాన్నిచ్చిన దర్శకుడు విక్రమ్ ని తీసుకొచ్చి పెట్టారు. అయితే అందులో సైతం ముఖ్యమైన విషయం లేకపోలేదు..అదేమిటంటే..అఖిల్ ని తెరపై స్టైలిష్‌గా చూపించిన విక్రమ్ అయితేనే అఖిల్ కు కరెక్ట్ అని, అఖిల్ ని స్టైలిష్ గా చూపించడంతో పాటూ హిట్టివ్వగల సత్తా విక్రమ్ కే ఉందని నాగార్జున భావించి ఈ నిర్ణయానికి వచ్చాడట.

అందుకోసమే…ఇటీవల పనిగట్టుకొని విక్రమ్ తో ఓ కథని సిద్ధం చేయించారట నాగార్జున. అది చాలా బాగా రావడంతో హనుని తప్పించి విక్రమ్ తో సినిమాని ఫైనల్ చేశారట. మొత్తానికి రెండో సినిమాకే మార్పులు చేర్పులు మొదలు పెట్టేశాడు మన యువ నట సామ్రాట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus