ఇప్పుడంటే ప్రేక్షకులు కూడా కొత్తదనానికి అలవాటు పడ్డారు కాబట్టి సినిమాలో ట్రాజెడీ క్లయిమాక్స్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఓకే చేస్తున్నారు. కానీ ఒక్కప్పుడు అలాంటి పరిస్థితి లేదు. హీరో, హీరోయిన్లు చనిపోయినా.. లేక… వాళ్ళు క్లయిమాక్స్ లో విడిపోయినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేవారు కాదు. డైరెక్టర్ అలా కథ రాసుకున్నప్పటికీ.. డబ్బులు పెట్టే నిర్మాత మరియు అందులో నటించే హీరో హీరోయిన్లు కూడా ఒప్పుకుంటేనే అది సాధ్యం అవుతుంది. ఒకవేళ వాళ్ళకు నచ్చకపోతే క్లయిమాక్స్ మార్చాల్సిందే.
అసలు విషయం ఏమిటంటే.. ‘ఏమాయ చేసావె’ సినిమా క్లయిమాక్స్ ను వేరేలా రాసుకున్నాడట. క్లయిమాక్స్ లో హీరోయిన్ కు మరో వ్యక్తిని పెళ్లిచేసుకుంటుంది. కానీ ఆ సినిమాలో హీరో డైరెక్ట్ చేసే సినిమాలో మాత్రమే హీరో హీరోయిన్లు కలుసుకుంటారట. ఇదే క్లయిమాక్స్ ను తమిళ వెర్షన్ ‘విన్నైతాండి వరువాయ’ కు అప్లై చేసాడు. కానీ తెలుగులో మాత్రం ఆ క్లయిమాక్స్ మార్చాలంటూ ఆ చిత్ర నిర్మాత మహేష్ సోదరి మంజుల ఒత్తిడి చేశారట. దీంతో ఆ క్లయిమాక్స్ మార్చనని గౌతమ్ మీనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘అసలు నా దృష్టిలో ‘ఏమాయ చేసవె’ ఓ సినిమానే కాదు అంటూ కొట్టిపాడేస్తున్నాడు ఈ డైరెక్టర్. డబ్బులు పెట్టే నిర్మాత ఏమైనా చెప్తాడు.. ఆ టైములో కాంప్రమైజ్ అయ్యి ఇన్నేళ్ళకు ఆ హిట్ సినిమాని కామెంట్ చేయడం అనేది కామెడీగా అనిపించకమానదు. నిజానికి చెప్పాలంటే.. తమిళంలో కంటే తెలుగులోనే ఈ చిత్రం మంచి హిట్టైంది. ఈ విషయం గౌతమ్ మీనన్ మరిచిపోయినట్టున్నాడు.
“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సౌత్ సినిమా టీజర్లు ఇవే..!