‘నా వెంట‌ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా’ బిగ్ హిట్ అవ్వాలి: కోదండ రామిరెడ్డి

రాజ‌ధాని ఆర్ట్ మూవీస్ బ్యాన‌ర్, జి వి ఆర్ ఫిల్మ్ మేక‌ర్స్ పై హుషారు, షికారు, రౌడీ బాయ్స్ లాంటి సూప‌ర్‌హిట్ చిత్రాలలో న‌టించిన తేజ్ కూర‌పాటి సోలో హీరోగా , అఖిల ఆక‌ర్ష‌ణ హీరోయిన్ గా వెంక‌ట్ వందెల ద‌ర్శ‌క‌త్వంలో ముల్లేటి నాగేశ్వ‌రావు నిర్మాణ సార‌ధ్యం లో ముల్లేటి క‌మ‌లాక్షి, గుబ్బ‌ల వేంక‌టేశ్వ‌రావు లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “నా వెంట‌ ప‌డుతున్న చిన్నాడెవ‌డ‌మ్మా”. ఈ చిత్రం నుండి విడుదలైన అన్ని పాటలకు సంగీత ప్రియుల నుండి అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా వచ్చిన దర్శకులు కోదండ రామిరెడ్డి, దర్శకులు సాగర్,ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ,గణేష్ మాస్టర్, యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి, పద్మిని నాగులపల్లి, మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతమ్, సహారా గ్రూప్ యం. డి. తస్కిన్, ఉషారాణి తదితరులతో పాటు చిత్ర యూనిట్ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ.. అందరూ కొత్త వారితో తీసిన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ చాలా బాగున్నాయి .ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిసియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినట్లనిపిస్తుంది సినిమా కూడా బాగుంటుందనుకుంటున్నాను. మంచి కథతో వస్తున్న ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

ప్రముఖ దర్శకుడు సాగర్ మాట్లాడుతూ..సినిమా ట్రైలర్, టీజర్, పాటలు చూస్తుంటే సినిమా బాగుంటుంది అనే నమ్మకం ఉంది. ప్రేక్షకులందరూ సెప్టెంబర్ 2 న థియేటర్ కు వచ్చి సినిమా చూసి అశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు

ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ..
టికెట్స్ రేట్స్ పెంచి నిర్మాతలు ఎంతో ఇబ్బంది పడుతున్న సమయంలో వచ్చిన బింబిసార, సీతారామం, కార్తికేయ సినిమాలు ఇండస్ట్రీ కి ఊపిరి నింపాయి.మళ్ళీ అలాంటి మంచి కంటెంట్ తో చిన్న సినిమా గా మొదలైన ఈ సినిమా పెద్ద సినిమాగా మారేలా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని సాంగ్స్ చాలా బాగున్నాయి. మంచి ప్రేమకథను దర్శకుడు వెంకట్ సెలెక్ట్ చేసుకొన్నాడు .ఈ చిత్రానికి నిర్మాతలు కూడా చాలా కష్టపడ్డారు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్, నందమూరి హరికృష్ణ పుట్టినరోజైన సెప్టెంబర్ 2 న విడుదల చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌ ముల్లేటి నాగేశ్వ‌రావు మాట్లాడుతూ…మా ప్రి రిలీజ్ కు వచ్చిన దర్శకులు కోదండ రామిరెడ్డి , సాగర్, ప్రసన్న కుమార్ , యం.ఆర్. సి. వడ్లపాటి చౌదరి, శశి ప్రీతమ్ లకు ధన్యవాదాలు. గణేష్ మాస్టర్ ఇందులో యాక్టింగ్ తో పాటు ఐదు పాటలకు కోరియోగ్రఫీ చెయ్యడం జరిగింది. సందీప్ ఇచ్చి పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ కొరత ఎక్కువగా ఉన్నా మాలాంటి చిన్న సినిమాలకు థియేటర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి కథను తెరాకెక్కించిన దర్శకుడు వెంకట్ కు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది. హీరో హీరోయిన్ లు చాలా బాగా నటించారు. మా అమ్మాయిని ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం చేస్తున్నాను.ఈ సినిమా తర్వాత త్వరలో మేము ప్రియతమ్ దర్శకత్వంలో ఒక సినిమా తీస్తున్నాము. తను ఇలాగే మంచి సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెప్టెంబర్ 2 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆశీర్వాదించాలని కోరుతున్నాను. అన్నారు.

చిత్ర నిర్మాత ముల్లేటి క‌మ‌లాక్షి మాట్లాడుతూ..మమ్మల్ని ఆశీర్వడించడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు..మా నాన్న నడవలేక ఇబ్బంది పడుతున్నా కూడా సినిమా తియ్యాలి అనే ప్యాషన్ ను నాన్న లో చూశాను. అందుకే మా నాన్న నాకు ఇన్స్పిరేషన్. సినిమా కష్టమేంటో నాకు తెలియాలని ఈ సినిమా ద్వారా నన్ను నిర్మాతగా పరిచయం చేస్తున్నాడు. అందుకు మా తల్లి తండ్రులకు పాదాభివందనాలు. ఒక సినిమా చేయడం ఎంత కష్టమో ఈ ఒక్క సినిమా చేయడంతో నాకొక జీవితం కనపడింది. ఒక సినిమా బయటకు రావాలంటే ఒక లైట్ బాయ్ దగ్గరనుండి నటీ నటులు, టెక్నిషియన్స్ వరకు వారి కలలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడతారు. ఇలా వీరందరూ కలిస్తేనే ఒక సినిమాగా బయటకు వస్తుంది. అలాంటి సినిమాను అవమానంగా చూడద్దు అని ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను. ఈ సినిమాకు కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.సంగీత దర్శకుడు సందీప్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు వెంకట్ గారు సెలెక్ట్ చేసుకొన్న కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే పెద్దలు తనికెళ్ళ భరణి గారికి, జీవా గారు ఇలా అందరూ బాగా సపోర్ట్ చేయడం వలెనే సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

యం. ఆర్. సి. వడ్లపాటి చౌదరి మాట్లాడుతూ..ఈ చిత్రానికి హీరో నిర్మాత ముల్లేటి నాగేశ్వరావు ఇండస్ట్రీ కి ఎంతో ప్యాషన్ తో వచ్చిన తను సినిమాలు తీసి ఎంతో నస్టపోయినా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమా తియ్యాలనే సంకల్పం తనలో బలంగా ఉండడంతో మళ్ళీ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సెప్టెంబర్ 2 న వస్తున్న మా సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

చిత్ర దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ..మా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలకు అలాగే నేను చెప్పిన కథ నచ్చగానే ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్న నిర్మాతలకు ధన్యవాదములు.మంచి కథతో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. సందీప్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.ఈ మధ్య మేము విడుదల చేసిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఇందులో హీరో, హీరోయిన్స్ మన పక్కింటి అమ్మాయి, అబ్బాయి లాగా చాలా చక్కగా నటించారు. టెక్నిషియన్స్, కూడా ఫుల్ సపోర్ట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున విడుదల చేస్తున్న ఈ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను.

చిత్ర హీరో తేజ్ కూర‌పాటి మాట్లాడుతూ..హుషారు,షికారు, రౌడీ బాయ్స్ లాంటి సినిమాలు చేసినా ఇప్పుడు సోలో హీరో గా నటిస్తున్న మొదటి చిత్రమిది. ఇప్పటి వరకు మా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. ఈ సినిమా 2 మంత్స్ లోనే షూట్ అయిపోయింది.మా నిర్మాతలు థి యేటర్స్ లలో రిలీజ్ చేద్దాం అనుకున్న టైమ్ లో కోవిడ్ రావడంతో డిలే అయ్యింది. మొదటి సారి సోలో హీరో గా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను అందరూ ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ అఖిల మాట్లాడుతూ..ఇది నా మొదటి సినిమా దర్శకుడు చెప్పిన కథ నాకెంతో నచ్చింది. ఈ కథ లో హీరోయిన్ కు మంచి స్కోప్ ఉందనుకొని ఈ సినిమా చేశాను.సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ మాట్లాడుతూ..ఒక సినిమాకు కథ ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం.. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు పాటలు బలం అనుకుంటున్నాను.దర్శకుడు వెంకట్ మొదటి ప్రయత్నంగా చక్కటి కథను సెలక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా బిగ్ సక్సెస్ అయ్యి పెద్ద సినిమాగా నిలవాలని కోరుతున్నాను అన్నారు

గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను నాలుగు పాటలకు వర్క్ చేశాను. ఇందులోని పాటలు అన్నీ బాగున్నాయి. హీరో, హీరోయిన్ లతో పాటు అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

సంగీత దర్శకుడు సందీప్ మాట్లాడుతూ..ఈ కథకు తగ్గట్టు పాటలన్నీ చాలా చక్కగా కుదిరాయి.ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకిలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ.. నిర్మాత ముల్లేటి నాగేశ్వ‌రావు తన కూతురును నిర్మాతగా పరిచయం చేస్తున్న అఖిలను బ్లెస్స్ చేయడానికి చాలా మంది పెద్దలు రావడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 2 వస్తున్న ఈ సినిమా బిగ్ బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus