పాపం క్రిష్… సారీ క్రిష్…!

‘ఎన్టీఆర్ బయోపిక్’ తో క్రిష్ చాలా డీలా పడిపోయాడు. ఈ చిత్రంతో తనకున్న మంచి పేరు అమాంతం పడిపోయింది. ఇక ‘మణికర్ణిక’ చిత్ర షూటింగ్ సమయంలో కూడా కంగనా తో విభేదాలు చోటుచేసుకోవడం… దీంతో వీరిద్దరూ మీడియా ముందు కూడా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఇక ఈ సంఘటనలతో కొన్నేళ్ళవరకు బయోపిక్ ని టచ్ చేయకూడదని డిసైడ్ అయ్యాడట క్రిష్.

ప్రస్తుతం క్రిష్ కి పెద్ద హీరోలు ఎవరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. స్టార్ హీరోలైతే తనని కలవడానికి కూడా మొహం చాటేస్తున్నారట. నిజానికి క్రిష్ అంత ఘోరంగా సినిమా తీయలేదు. కానీ వాస్తవాలను దాచి భజన సినిమాని తీసాడనే విమర్శలు మూటకట్టుకున్నాడు. దీంతో తన రెగ్యులర్ పంధా లో సినిమా తీసి… ఆ విమర్శలను తుడిచేయాలని క్రిష్ భావిస్తున్నాడట. ప్రస్తుతానికైతే బయోపిక్ ల పేరు చెబితే బయపడిపోతున్నాడట క్రిష్. అవసరమైతే తన సొంత బ్యానర్లోనే ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus