పెద్ద హీరోల పైనే కన్నేసిన దర్శకుడు కె.రాఘవేంద్ర రావు..!

  • October 27, 2020 / 09:52 PM IST

‘కింగ్’ నాగార్జునతో కె.రాఘవేంద్ర రావు గారు తెరకెక్కించిన ‘ఓం న‌మో వేంక‌టేశాయ‌’ చిత్రం మంచి టాక్ నే సంపాదించుకున్నప్పటికీ ఎందుకో యూత్ ను ఆకర్షించలేక విజయం సాధించలేకపోయింది. ఆ చిత్రం తరువాత మన దర్శకేంద్రుడు మరో సినిమా డైరెక్ట్ చెయ్యలేదు. దాంతో ఇక డైరెక్షన్ కు ఆయన గుడ్ బై చెప్పేసినట్టే అని ప్రచారం జరిగింది‌.కానీ ఓ మంచి హిట్ ఇచ్చే కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాలని రాఘవేంద్ర రావు గారు భావిస్తున్నారట.

అందుకే `పెళ్ళిసందడి` పేరుతో ఓ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆయనే డైరెక్ట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఎందుకో ఆయన సడెన్ గా డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌తల్ని గౌరీ రోన‌కి అప్ప‌గిండం గమనార్హం. దీనికి రెండు కారణాలు అయ్యుండొచ్చని ఫిలింనగర్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఒకటి ప్రభాస్ – నాగ్ అశ్విన్ ల చిత్రానికి ఈయన మెంటర్ గా వ్యవహరిస్తున్నారని కొందరు చెబుతున్నారు.

ఇంకొకటి కె.రాఘవేంద్ర రావు గారు తన చివరి చిత్రాన్ని కచ్చితంగా ఓ పెద్ద హీరోతోనే చెయ్యాలని భావిస్తున్నట్టు మరికొందరు చెబుతున్నారు.ఇవి రెండూ కాకపోతే.. ‘పెళ్ళిసందడి’ యూత్ ఫుల్ సినిమా కాబట్టి…ఇప్పటి ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని.. ఆయన న్యాయం చెయ్యలేరు అని భావించి కొత్త డైరెక్టర్ కు అప్పగించి ఉండొచ్చు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus