‘ఆర్ఆర్ఆర్’.. సినిమా పూర్తయినా హీరోలను వదలరట!

  • October 26, 2020 / 04:03 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని టీజర్ల ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగ్ ఇటీవల పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కూడా ఈ విషయంలో క్లారిటీ లేక తమ తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయిహతే వెంటనే త్రివిక్రమ్ సినిమా మొదలుపెడతానని ఎన్టీఆర్ చెబుతున్నాడట. అందుకే త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయినా.. హీరోలు గెటప్పులు మార్చడానికి వీలులేదని రాజమౌళి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ వరకు గెటప్పులు అలాగే ఉంచాలని, అలానే హీరోలను ప్రమోషనల్ టూర్ కి తీసుకెళతానని రాజమౌళి చెప్పినట్లు సమాచారం.

ఒకవేళ రీషూట్ అవసరమైతే హీరోలు గెటప్స్ మారిస్తే కుదరదని అన్నారట. రాజమౌళి గనుక ఇలా నిర్ణయించుకుంటే.. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తేయ్యే వరకు కూడా హీరోలు తమ లుక్ ను మార్చుకునే వీలుండదు. ఈ క్రమంలో ఎన్టీఆర్, చరణ్ ఎప్పటికి ఫ్రీ అవుతారో.. తమ తదుపరి ప్రాజెక్ట్స్ ని ఎప్పుడు పూర్తి చేస్తారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus