తప్పు చేసిన వాళ్ళను తరువాత.. ముందు వీడిని ఉరితీయండి..!

  • December 4, 2019 / 06:25 PM IST

ఇటీవల దిశ హత్యాచారం కేసు దేశం మొత్తాన్ని కుదిపివేసింది. నలుగురు మృగాలు ఆమె పై పడి రేప్ చేసి.. ఆ తరువాత అత్యంత క్రూరంగా పెట్రోల్ పోసి దహనం చేశారు. ఇలాంటి మృగాల్ని వెంటనే చంపెయ్యాలి అంటూ ఎంతో మంది నిరసనలు తెలుపుతున్నారు. అన్ని రంగాల వారు కూడా దిశ కు న్యాయం చెయ్యాలని కోరుతూ.. స్పందిస్తున్నారు. సినీ సెలెబ్రిటీలు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది మాత్రం కనీసం జాలి, కరుణ లేకుండా చాలా ఘోరంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఫిలిం మేకర్ డేనియల్ శ్రవణ్ అనే దర్శకుడు కూడా ఉన్నాడు.

ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా ఈ డేనియల్ శ్రవణ్ మాట్లాడుతూ… “మహిళలు హత్యలకు గురికాకుండా ఉండాలంటే అత్యాచారం చేస్తున్నప్పుడు సహకరించాలి. రేపిస్ట్ లు అత్యాచారం చేసి చంపడానికి కారణం మహిళా సంఘాలు, సమాజమే..! ప్రభుత్వం రేప్ ని, రేపిస్ట్ లను లీగల్ చేస్తే అత్యాచారం చేసిన తరువాత చంపాలనే ఆలోచన రేపిస్ట్ లకు రాదు. ‘దిశ’ హత్యకు కారణం ఆ నలుగురు వ్యక్తులు కాదు.. ప్రభుత్వం, మహిళా సంఘాలే…! మగవాళ్ళు రేప్ చేస్తున్నప్పుడు సహకరించాలి… లేకపోతే ఎక్కడ పోలీసులకు చెప్తారోననే భయంతో వాళ్ళు చంపేస్తున్నారు. ప్రభుత్వం రేపిస్ట్ ల పై ఎలాంటి చట్టాలు రుద్దకపోతే వాళ్ళు కూడా ఆడవాళ్ళను హత్యలు చెయ్యరు. ‘రేప్’ అనేది సీరియస్ విషయం కాదు, కానీ హత్య చాలా పెద్ద నేరం. ఆడవాళ్ళు హత్యలకు గురి కాకుండా ఉండాలంటే రేప్ ను లీగల్ చేయడమే పరిష్కారం. పోలీసులకు ఫోన్ చేసే బదులు హ్యాండ్ బ్యాగ్ లో కండోమ్స్ పెట్టుకోండి.. దీని వలన ప్రాణాలు దక్కుతాయి. ” అంటూ ఇష్టమొచ్చినట్టు రాసుకొచ్చాడు. ఈయన పై ప్రముఖ సింగర్ చిన్మయి కూడా విరుచుకుపడింది. ‘తప్పు చేసిన వాళ్ళని తరువాత ముందు ఇలాంటి మృగాల్ని ఉరితీయండి’ అంటూ నెటిజన్లు కూడా మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

1

2

3

4

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus