వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా విడుదుల చేసిన టీజర్ కి వచ్చిన వ్యూస్ బట్టి ఇది స్పష్టమవుతుంది. సాధారణంగా ఈమధ్య మహేష్ టీజర్లు చాలా వరకూ ఒకే డ్రెస్ లో అదీ ఒకే లుక్ లో కనిపిస్తూ ఉన్నవే చూసాం. కానీ ‘మహర్షి’ టీజర్లో మహేష్ బాబు స్టైలిష్ గా కనిపించడంతో పాటూ మూడు వేరియేషన్స్ ఉన్న లుక్స్ లో కనిపిస్తున్నాడు. బిజినెస్మేన్ గా, స్టూడెంట్ గా, అలాగే ఓ సాధారణ వ్యక్తిగా మహేష్ కనిపిస్తున్నాడు. అంతేకాదు ‘పోకిరి’ చిత్రంలో కంటే యంగ్ గా కనిపిస్తున్నాడు మహేష్.
ఇక మహేష్ గెటప్స్ పై వంశీ పైడిపల్లి మాట్లాడాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. మహేష్ అభిమానులతో పాటూ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడన్న విషయం తెలియజేయడానికే టీజర్ ను ఇలా కట్ చెయ్యడం జరిగింది” అంటూ వంశీ తెలిపాడు. ఇక ‘మహర్షి’ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా…. హీరో అల్లరి నరేష్ కూడా ఈ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి పొట్లూరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ కి ఇది 25 వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.