మాస్ మహారాజా సినిమాకి ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్

  • September 20, 2018 / 07:10 AM IST

“టచ్ చేసి చూడు, నేల టికెట్టు” సినిమా వరుసపెట్టి డిజాస్టర్స్ అయ్యాయి.. అప్పుడెప్పుడో మొదలైన “అమర్ అక్బర్ ఆంటోని” షూటింగ్ ఇప్పటికీ ఫినిష్ అవ్వకపోవడమే కాకుండా రిలీజ్ విషయంలో ఇప్పటికే రెండుసార్లు డేట్ కూడా మారింది. ఇప్పటికీ ఎప్పుడు విడుడలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. దాంతో రవితేజ అభిమానులందరూ ఢీలాపడిపోయారు. ముఖ్యంగా ‘తేరీ” రీమేక్ కూడా అటకెక్కడంతో రవితేజ తదుపరి సినిమా విషయంలో కూడా క్లారిటీ లోపించింది.

అయితే.. నిన్న “ఎక్కడికి పోతావు చిన్నవాడా” ఫేమ్ వి.ఐ.ఆనంద్ ఇచ్చిన అప్డేట్ మాస్ మహారాజా అభిమానులకు ఆనందం కలిగించాడు. రవితేజతో తన తదుపరి చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైందని, తమన్ సాంగ్స్ రికార్డింగ్ మొదలెట్టాడని పేర్కొన్నాడు వి.ఐ.ఆనంద్. డిసెంబర్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. మరి ఈ సినిమా మొదలయ్యేలోపైనా “అమర్ అక్బర్ ఆంటోనీ” విడుదలవుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus