రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న.. వినాయక్?

  • August 13, 2019 / 05:46 PM IST

వి.వి.వినాయక్.. పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ లో మాస్ చిత్రాలకి కేర్ అఫ్ అడ్రెస్స్ అంటే వినాయక్ పేరు చెప్పేవారు. అయితే ఇప్పటి పరిస్థితి మారిపోయింది. ఈ మధ్య కాలంలో వినాయక్ కు సరైన హిట్టు లేదు. ఇక హీరోలందరూ వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో వినాయక్ కు అవకాశాలు లేవు. దీంతో హీరోగా మారి ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. వినాయక్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ టాక్ వినిపిస్తుంది.

విషయం ఏమిటంటే… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. కాపు కార్పొరేషన్ చైర్మన్ గా వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి దర్శకుడు వినాయక్ కూడా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో ‘రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు అంటే నాకు చాలా అభిమానం. ఆయన తండ్రి గారిలానే రాజా కూడా ప్రజా అభిమానాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాజాకు ‘కాపు కార్పొరేషన్’ చైర్మన్ పదవి ఇచ్చిన జగన్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. జగన్ గారి ప్రసంగాలు, మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి” అంటూ జగన్ పై ప్రశంసలు కురిపించాడు. వినాయక్ త్వరలోనే వైసిపి లో జాయినవ్వబోతున్నారని… అందులో భాగంగానే ఇలా ఈ కార్యక్రమానికి హాజరయ్యారని టాక్ వినిపిస్తుంది. ఇందుకోసం వినాయక్ కు మంచి ప్యాకేజీ కూడా అందిందని సమాచారం. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus