బికినీ ఫోటోషూట్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న దిశా

  • November 23, 2018 / 11:57 AM IST

లోఫ‌ర్ చిత్రంతో తెలుగు కుర్ర‌కారు గుండెల్లో సూదంటురాయిలా గుచ్చుకుంది దిశాప‌టానీ. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ టు బాలీవుడ్, బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ అమ్మ‌డి ప‌య‌నం గురించి తెలిసిందే. తెలుగులో లోఫ‌ర్ ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోయినా బాలీవుడ్‌లో మాత్రం కెరీర్ ప‌రంగా సంతృప్తిగానే ఉంది. బ్లాక్‌బ‌స్ట‌ర్లు కొట్టేయ‌క‌పోయినా అవ‌కాశాల‌కేం కొద‌వ లేద‌క్క‌డ‌. ఇక సినిమాల‌తో కంటే దిశా ప‌టానీ పేరు ఎఫైర్ల‌తోనే మార్మోగిపోతోంది. అక్క‌డ మార్ష‌ల్ ఆర్ట్స్ హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో ప్రేమాయ‌ణం సాగిస్తూ నిరంత‌రం వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ జంట ఎవ‌రికీ అంతుచిక్క‌కుండా షికార్లు చేస్తోంది.తాజాగా సీకే లోదుస్తుల సిరీస్ లో కొత్త ఫోటోని రిలీజ్ చేసింది బాలీవుడ్ న‌టి దిశాప‌టాని. ఇన్ స్టాగ్రామ్‌లో ఈ ఫోటో వేడెక్కిస్తోంది. బ్లాక్ కలర్ కెల్విన్ క్లెయిన్ లోదుస్తుల్లో దర్శనమిచ్చి మరోమారు వేడెక్కించింది. ఢిల్లీలో సీకే స్టోర్ లాంచ్ కి యూత్ ని ఈ సందర్భంగా ఆహ్వానించింది ఈ బ్యూటీ. సీకే బ్రాండ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండార్డ్. అందుకు తగ్గట్టే అమ్మడు భారీ మొత్తాన్నే ఖాతాలో వేసుకుందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus