జయం రవి సరసన జాకీచాన్ గర్ల్ ఫ్రెండ్!

Advertisement

ఒక నాలుగు నెలలపాటు “బాహుబలి”కి ప్రిపేర్ అయిన రేంజ్ లో కత్తిసాము మొదలుకొని మల్లయుద్ధం వంటివి భారీగా ప్రిపేర్ అయ్యి.. సదరు ప్రిపరేషన్ లో దెబ్బలు తగిలినా తానెక్కడా తగ్గట్లేదంటూ ప్రెస్ నోట్లు విడుదల చేయించుకొని.. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఫస్ట్ లుక్ స్కెచ్ లను సైతం విడుదల చేసి.. ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిన తర్వాత చాలా సింపుల్ గా డేట్స్ కుదరడం లేదు అంటూ వాకౌట్ చేసిన శ్రుతి హాసన్ టీం మెంబర్స్ అందరికీ చిన్నసైజు షాక్ ఇచ్చింది. శ్రుతి సడన్ గా నిష్క్రమించేసరికి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయాడు దర్శకుడు సుందర్.సి.

ఆ తర్వాత శ్రుతి స్థానంలో అంజలి వచ్చిందని, హన్సిక జాయిన్ అయ్యిందని చాలా వార్తలొచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం శ్రుతి స్థానాన్ని భర్తీ చేసింది “లోఫర్”లో హీరోయిన్ గా నటించి తన అందాలతో అందర్నీ మెప్పించిన దిశా పటానీ అని తెలుస్తోంది. ఆల్రెడీ దిశా పటానీ “కుంగ్ ఫూ యోగా” అనే సినిమాలో నటించి ఉండడం, ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు కావాల్సిన అన్నిట్లోనూ ట్రయినింగ్ తీసుకొని ఉండడంతో దిశా అయితే పర్ఫెక్ట్ అని ఆమెను ఫైనల్ చేసిందట చిత్రబృందం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus