నయన్ టు స్వాతి.. 30 వస్తేనే కానీ ఈ భామలు పెళ్లి చేసుకోలేదు..!

బ్యాచిలర్ లైఫ్ కు ఫ్యామిలీ లైఫ్ కు సంబంధం ఉండదు. ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీకి కూడా టైం కేటాయించాల్సి ఉంటుంది. లేదంటే.. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకునే ప్రమాదం ఉంటుంది. బహుశా ఈ కారణం వల్లే అనుకుంట.. కొంతమంది నటీనటులు పెళ్ళీడు వచ్చినా వెంటనే పెళ్లి చేసుకోలేదు. వర్క్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేయలేక ఇబ్బంది పదాలేమో అని భావించి వాళ్ళు పెళ్లిని డిలే చేస్తూ వచ్చారు. ఈ విషయంలో హీరోయిన్లు మినహాయింపు కాదు. కొంతమంది భామలు మాత్రం 30 లలో పెళ్లి చేసుకున్నారు. ఆ లిస్ట్ లో ఎవరు ఉన్నారో ఓ లుక్కేద్దాం రండి :

1) కాజల్ :

తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని.. 35 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకుంది కాజల్. ఎప్పుడైతే ఆమెకు సినిమా ఆఫర్లు తగ్గాయో అప్పుడు పెళ్లి పీటలెక్కింది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు.

2) నయనతార :

37 ఏళ్ళు వచ్చాక తన ప్రియుడు విగ్నేష్ శివన్ ని పెళ్లాడింది. సరోగసి పద్దతిలో ఈ దంపతులు కవలలకు జన్మనిచ్చారు కూడా.

3) అలియా భట్ :

తన ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను 29 ఏళ్ళ వయసులో పెళ్లాడింది. వీరికి ఓ పాప కూడా జన్మించింది.

4) హన్సిక :

తన బెస్ట్ ఫ్రెండ్ సోహైల్ 31 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంది.

5) ప్రణీత :

ప్రముఖ బిజినెస్ మెన్ నితిన్ రాజుని ఈమె 29 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంది.

6) శ్రీయ శరన్ :

36 ఏళ్ళ వయసులో రష్యాకి చెందిన క్రీడాకారుడు ఆండ్రీ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉంది.

7) కలర్స్ స్వాతి :

తన బాయ్ ఫ్రెండ్ వికాస్ వాసుని 31 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంది.

8) నిక్కీ గల్రాని :

సంజన గల్రాని చెల్లెలు .. ‘కృష్ణాష్టమి’ ‘మలుపు’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈమె 30 ఏళ్ళ వయసులో హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకుంది.

9) సమంత :

నాగ చైతన్యని ఈమె తన 30 వ ఏట పెళ్లి చేసుకుంది. కానీ 2021 లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

10) భాను శ్రీ మెహ్రా :

వరుడు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన భాను శ్రీ 37 ఏళ్ళ వయసులో కరణ్ మానస్ ను పెళ్లి చేసుకుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus