టాలీవుడ్ లో ప్రస్తుతం డైరక్టర్ క్రిష్ పేరు బాగా వినిపిస్తోంది. అతి తక్కువ కాలంలో గ్రేట్ మూవీ “గౌతమీపుత్ర శాతకర్ణి’ ని పూర్తి చేశారని సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ వందో చిత్రాన్ని అభిమానుల అంచనాకు మించి తెరకెక్కించారని ప్రసంసలజల్లు కురిపిస్తున్నారు. ఈ ఫిల్మ్ ఆడియో విడుదల కార్యక్రమం కొన్ని రోజుల క్రితం తిరుపతిలో ఎంతో వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ తర్వాత శ్రీయ క్రిష్ ని గొంతు పట్టుకొని నలుపుతున్నట్లు ఉండే ఫోటో బయటికి వచ్చింది. షూటింగ్ సమయంలో మమ్మల్ని కష్టపెట్టి నటనను రాబట్టుకున్నట్టు శ్రీయ సరదాగా కామెంట్ చేసింది. అంతవరకు బాగానే ఉంది కానీ ఈ ఫొటోలో మరో అమ్మాయి క్రిష్ బుగ్గమీద ముద్దు పెడుతోంది. ఈమె ఎవరు? అంటూ అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.
తీరా తెలిసిన విషయం ఏమిటంటే ఆమె ఎవరో కాదు క్రిష్ భార్య రమ్య. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పెళ్లి అయింది. అయినా భార్యతో ఎక్కువ రోజులు గడపకుండా క్రిష్ రాత్రి పగలు చిత్రం కోసమే శ్రమించారు. ఈ సమయంలో రమ్య వృత్తి బాధ్యతలను గౌరవించి తోడుగా నిలిచింది. అందుకే ఆమె సహకారం చాలా ఉంది అని క్రిష్ అందరి ముందు చెప్పుకున్నారు. ఇంతకీ ఆ ముద్దు ఎందుకోసమో ఇప్పటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది… గొప్ప చిత్రాన్ని రూపొందించినందుకు. ఇక ఈ చిత్రం రిలీజ్ అయిన తర్వాత క్రిష్ ఎంతమంది అభిమానం చూరగొంటారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.