ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగులో నటించిన మొదటి చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'(Don’t Trouble the Trouble). రాజమౌళి సమర్పణలో ఆయన తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఆర్కా మీడియా’ సంస్థ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది. బేబీ సారా పాలేకర్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను మెప్పించాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చి సినిమాకి మరింత పుష్ ఇచ్చాడు.
దీంతో అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమాపై మొదటి నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో వసూళ్ళు రాబట్టలేకపోయింది. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 0.28 cr |
| సీడెడ్ | 0.03 cr |
| ఉత్తరాంధ్ర | 0.11 cr |
| ఈస్ట్ +వెస్ట్ | 0.05 cr |
| కృష్ణా | 0.08 cr |
| గుంటూరు | 0.05 కోట్లు |
| నెల్లూరు | 0.02 cr |
| ఏపీ+తెలంగాణ | 0.62 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్ | 0.08 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ (గ్రాస్) | 0.70 కోట్లు (షేర్) |
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.5 కోట్లు. మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.0.70 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.25 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు.