చైతు మీద అంత నమ్మకం ఏంటో..?

  • August 16, 2016 / 10:37 AM IST

ఒక సినిమాను రూపొందిస్తున్నామంటే ముందుగా హీరో ఎవరు.. బడ్జెట్ ఎంత పెడితే వర్కవుట్ అవుతుందనే విషయాలను దృష్టిలో పెట్టుకొని సినిమా మొదలుపెట్టాలి. అయితే కొందరు నిర్మాతలు మాత్రం బడ్జెట్ కు మించి ఖర్చు పెడుతుంటారు. అది సినిమా మీద నమ్మకమనే చెప్పాలి. సినిమా హిట్ అయ్యి వసూళ్లు సాదిస్తే పర్లేదు కానీ సీన్ రివర్స్ అయితే మాత్రం కష్టం.

అసలు విషయంలోకి వస్తే.. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నిజానికి చైతు బడ్జెట్ 10 కోట్లే.. చైతు మార్కెట్ రేంజ్ అంతే.. గౌతమ్ మీనన్ డైరెక్టర్ కాబట్టి మరో మూడు కోట్లు ఎక్కువయినా.. పర్లేదు కానీ అంతకు మించి ఎక్కువైతే కష్టం. అయితే ఈ చిత్ర నిర్మాతలు సినిమాను 22 కోట్లలో నిర్మించినట్లు తెలుస్తోంది.

ప్రమోషన్స్ కు మరో రెండు కోట్లు వేసుకుంటే మొత్తం 24 కోట్లు దాటిపోతుంది. చైతు మీద ఎలాంటి నమ్మకంతో ఇంత బడ్జెట్ ను పెట్టారో.. వాళ్ళకే తెలియాలి. నిర్మాతలకు ఈ సినిమాతో లాభాలు రావాలని ఆశీద్ధాం!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus