Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది .. ఎలా ఉందంటే?

  • August 8, 2024 / 04:15 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ,ఎనర్జిటిక్ స్టార్ రామ్  (Ram)  కలయికలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. పూరీ జగన్నాథ్ అప్పులన్నీ తీర్చేయడమే కాకుండా హీరో రామ్ మార్కెట్ ను రెండింతలు పెంచింది ఈ సినిమా. ఆ సినిమా తర్వాత ఇద్దరికీ హిట్టు పడలేదు. రామ్ యావరేజ్ సినిమాలతో నెట్టుకొస్తున్నాడు. పూరీ జగన్నాథ్ అయితే ‘లైగర్'(Liger)  తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అంతేకాదు ఆ సినిమా మిగిల్చిన నష్టాల వల్ల.. డిస్ట్రిబ్యూటర్లు పూరీ పై ఒత్తిడి చేయడం కూడా అందరం చూశాం.

Double Ismart

విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) మొదలుపెట్టిన ‘జె జిఎం'(జన గణ మన) కూడా ఆగిపోయింది. సో అటు రామ్ కి.. ఇటు పూరీకి సాలిడ్ హిట్ కావాలి. ఆ కసితోనే ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) చేశారు. ఇది ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్ అనే సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. టీజర్, ట్రైలర్ వంటివి మాస్ ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కూడా కంప్లీట్ చేసుకుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ‘డబుల్ ఇస్మార్ట్’ ను వీక్షించిన తర్వాత సెన్సార్ వారు ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికెట్ ను జారీ చేయడం జరిగింది. సినిమా అయితే చాలా బాగా వచ్చిందని టాక్. పూరీ జగన్నాథ్, రామ్…లు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారనే కామెంట్స్ కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్..లలో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్స్,మథర్ సెంటిమెంట్ సినిమాకి హైలెట్ పాయింట్స్ అని తెలుస్తుంది. ఇక దర్శకుడు పూరీ జగన్నాథ్ వన్ లైనర్స్, మణిశర్మ మ్యూజిక్,సంజయ్ దత్- రామ్.. పాత్రల మధ్య వచ్చే మైండ్ గేమ్స్,టెక్నికల్ వాల్యూస్ కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని సమాచారం.

నాగ చైతన్య – శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వార్తల్లో నిజమెంత?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus