బాహుబలి కంక్లూజన్ లో ఆకట్టుకునే విషయాలను వెల్లడించిన ప్రభాస్!

  • November 1, 2016 / 01:56 PM IST

బాహుబలి బిగినింగ్ చిత్రానికి మించి ఉండేలా బాహుబలి కంక్లూజన్ ని దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని ఆసక్తికర సంగతులు వెల్లడించారు. “బాహుబలి మొదటి పార్ట్ లో యాక్షన్ సీన్లు అందరికీ నచ్చాయి.

బాహుబలి రెండో పార్ట్ లో మరింత యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఇందుకోసం మేము చాలా కష్టపడ్డాం. ఇవి కూడా తప్పకుండా ఆడియన్స్ కి నచ్చుతుందని టీమ్ మొత్తం నమ్ముతున్నాం” అని చెప్పారు. ఇంకా డార్లింగ్  మాట్లాడుతూ “బాహుబలి 2 లో అమరేంద్ర బాహుబలి నటనలో అనేక వేరియేషన్స్ చూడవచ్చు. అతని జీవితంలో అనేక అప్ అండ్ డౌన్ లు ఉంటాయి. అప్పుడు వచ్చే డ్రామా సన్నివేశాలు మహిళలను కంటతడి పెట్టిస్తాయి” అని వివరించారు. జక్కన్న డ్రామా సీన్లను తెరకెక్కించడంలో నేర్పరి. ఛత్రపతి సినిమాలో అమ్మ, కొడుకు మధ్య వచ్చే సీన్లు అందరి కళ్లను చెమర్చేలా చేశాయి.

అదే విధంగా బాహుబలి 2 లో  సెంటిమెంట్ సీన్లు హైలెట్ కానున్నాయి. ప్రభాస్ నటన, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, కీరవాణి సంగీతం కలిసిన డ్రామా సీన్లు ప్రేక్షకుల హృదయాలను మరోమారు మీటనున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus