జిగర్తాండ రీమేక్ కోసం డబ్ స్మాష్ బ్యూటీని దించిన హరీష్ శంకర్

Advertisement

వరుణ్ తేజ్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ లో రగ్గడ్ లుక్ లో కనిపించనున్నాడు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలవ్వనుంది. తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన “జీగార్తాండ”కు రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నమోదయ్యాయి.

బాబీ సింహా పోషించిన డాన్ పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తుండగా.. సిద్ధార్థ్ పాత్ర కోసం శ్రీవిష్ణును ఫైనల్ చేసినట్లు టాక్. అయితే.. రీమేక్ సినిమాలను తనదైన టచ్ తో మరోస్థాయికి తీసుకెళ్ళే హరీష్ శంకర్ ఈ సినిమాకి కూడా భారీ మార్పులు చేశాడు. అందులో భాగంగానే ఒరిజినల్ లో లేని హీరోయిన్ క్యారెక్టర్ ను యాడ్ చేశాడు. ఒరిజినల్ వెర్షన్ లో బాబీ సింహాకూ గర్ల్ ఫ్రెండ్ ఉండదు. కానీ.. హరీష్ చేసిన మార్పుల పుణ్యమా అని కొత్త క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యింది. ఆ పాత్ర కోసం తమిళనాట డబ్ స్మాష్ లతో బాగా పాపులారిటీ & క్రేజ్ సంపాదించుకున్న మృణాలినీ అనే కొత్తమ్మాయిని తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus