Nithiin: నితిన్ సినిమా వల్ల ఆ నటిని తిట్టిపోశారట.. ఏమైందంటే?

Advertisement

జబర్దస్త్ తో పాపులర్ అయిన సత్య శ్రీ (Satya Sri) .. ఓ సినిమాలో సాంగ్ కి డాన్స్ చేయడం వల్ల చాలా నెగిటివిటీ ఫేస్ చేసిందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ విషయం చెప్పి షాకిచ్చింది. సత్య శ్రీ (Satya Sri) మాట్లాడుతూ… ” ‘ఎక్స్ట్రా’ (Extra Ordinary Man) సినిమా రిలీజయ్యాక నాకు కొంతమంది పోలీసుల నుంచి కాల్స్ వచ్చాయి. ఒక రోజు నేను పడుకున్నప్పుడు ఓ లేడీ పోలీస్ కాల్ చేసి.. ‘ఆ సాంగ్ ఏంటి? అలాంటి సాంగ్స్ ఎట్లా చేస్తారు? మా డ్రెస్ వేసుకొని… సిగ్గులేకుండా అలాంటి పాటలకి డాన్స్ ఏంటి?’ అంటూ ప్రశ్నించారు.

Nithiin

అందుకు నేను ‘నాకు సంబంధం లేదు… నేను నటిని మాత్రమే…! డైరెక్టర్ చెబితే చేశాను. మీరు వాళ్ళని అడగండి అని చెప్పాను. ఇదే విషయాన్ని తర్వాత నేను మూవీ యూనిట్ కి చెప్పాను. అందుకు వాళ్ళు… ‘ అవి పట్టించుకోకు.. మేము చూసుకుంటాం’ అన్నారు. వాస్తవానికి ముందు ‘నేను ఆ పాట చెయ్యను’ అన్నాను.

వల్గర్ గా అనిపిస్తుంది అని చెప్పాను. సినిమా మొదలయ్యే ముందు నాకు ఆ పాట గురించి చెప్పలేదు. కానీ సినిమాకు కమిట్ అయ్యాను కాబట్టి, డబ్బులు తీసుకున్నాను కాబట్టి చేశాను. ఆ స్టెప్స్ నాకు ఇబ్బందిగా ఉన్నాయి అని శేఖర్ మాస్టర్ (Sekhar Master) కి చెప్పాను. ఆయన… ‘నీకు ఈ సాంగ్ చాలా ప్లస్ అవుతుంది… వల్గర్ గా ఉంటే నేను కంపోజ్ చేయను కదా?’ అని అన్నారు.

దీంతో.. ‘సరే నాకు ఎలాగూ సాంగ్స్ అవీ పెట్టరు కదా..! అని చేసేద్దాము అని ఫిక్స్ అయ్యి చేశాను. మా ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పాను. మా నాన్న షూటింగ్ కి కూడా వచ్చి చూశారు. ‘దీంట్లో ఏముంది.. పర్వాలేదు’ అన్నారు. తర్వాత నితిన్ ‘మీ ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి’ అని అన్నారు. ఆ సాంగ్ వల్ల నాకు ఆఫర్స్ అయితే బాగానే వస్తున్నాయి” అంటూ చెప్పుకొచ్చింది.

అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus