డైలాగులు చెప్పడానికి శ్రమిస్తున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.!

  • March 26, 2018 / 01:46 PM IST

సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం మహానటి. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తుండగా అతని భర్త పాత్రను మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పోషించారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి కుమారుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన దుల్కర్ యువతలో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగులోనూ పరిచయం కాబోతున్నారు. తొలి సినిమాతోనే తెలుగు వారికీ దగ్గరికావాలని భావిస్తున్నారు. అందుకే షూటింగ్ అప్పుడు కష్టపడ్డారు. అంతటితో అతను లైట్ తీసుకోలేదు.

తెలుగువారికి తన నటనతో పాటు గొంతుని వినిపించాలని ఫిక్స్ అయ్యారు. అందుకోసమే తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారు. నిన్నటి నుంచి తన పాత్రకు డబ్బింగ్ చెప్పే పనిలో దుల్కర్ సల్మాన్ నిమగ్నమయ్యారు. దీని గురించి ఆయన అభిమానులతో పంచుకున్నారు. “నేను పరీక్షల కోసం కూడా ఎప్పుడూ ఇంత కష్టపడలేదు.  తెలుగులో తొలిసారిగా డబ్బింగ్ చెప్పడానికి శ్రమిస్తున్నాను” అంటూ డబ్బింగ్ స్టూడియోలో తాను ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేశారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్  అందిస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus