దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌ సెన్సార్ రివ్యూ !

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి బ్రాహ్మిన్ పాత్రలో నటించి మెప్పించబోతున్న చిత్రం డీజె. ఎప్పుడూ ఊర మాస్ సినిమాలకే ప్రాధాన్యత ఇచ్చే బన్నీ తన స్టైల్ మార్చి ఈ సరికొత్త ప్రయోగానికి ప్లాన్ చేశాడు. కధ నచ్చిందో, లేక కధలో కధనం నచ్చిందో తెలీదు కానీ మొత్తంగా చూసుకుంటే  ఈ సినిమా చిన్న చిన్న అభియోగాల మినహా…ఏ గొడవ లేకుండా షూటింగ్ పోర్టీ చేసుకుంది. అయితే చివరి నిముషంలో ఖంగారు లేకుండా ఈ సినిమా సెన్సార్ ను కూడా ఒక వారం ముందే పూర్తిచేసి రిలీజ్ కు ఏవిధమైన అడ్డంకులు లేకుండా రెడీ పెట్టేసారు డీజె దర్శకనిర్మాతల టీమ్. ఇక తాజ్‌గ సెన్సార్ పూర్తి చేసుకున్నా ఈ సినిమా విశేషాలు ఏంటి అంటే ఒక్కసారి ఈ మ్యాటర్ చదవండి…సెన్సార్ నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఈమూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి….అంటే టాప్ హీరోల సినిమాలు అంటే పెద్దపెద్ద ఫైట్స్ రక్తపాతం ఉండటం కామన్ కాబట్టి ఈమూవీకి కూడ యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది అంటున్నారు. అక్కడక్కడ సెన్సార్ అభ్యంతరం చెప్పిన కొన్ని డైలాగులకు వినిపించకుండా మ్యూట్ చేస్తామని తెలిపినట్లు తెలుస్తోంది.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్ట్ ఆఫ్ ఒక గంట 23 నిముషాలు ఉంటుందని సెకండ్ ఆఫ్ ఒక గంట 12 నిముషాలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక స్టెప్స్, సాంగ్స్ విషయానికి వస్తే…ఈ సినిమాలోని ఒక పాటకు బన్నీ అభిమానులు లేచి చిందులు వేస్తారని ఆ పాటలో గ్రాఫిక్స్ అంత బాగున్నాయని సెన్సార్ సభ్యుల నుంచి వస్తున్న టాక్. అయితే మూవీ క్లాస్ నా లేక మాస్ నా అంటే… ఈ మూవీ పూర్తిగా మాస్ క్లాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించాడని సెన్సార్ సభ్యులు హరీష్ ను అభినందించినట్లు టాక్. మరి ఎన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, మరో పక్క మూవీ కూడా దగ్గర్లో ఉంది…అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా బన్నీ కరియర్ లో 100కోట్ల మూవీగా నిలబడుతుంది అని చెప్పక తప్పదు. అదీ మ్యాటర్.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus