“తొలిప్రేమ”కు ముందు రాశీఖన్నాలో అంతమంచి నటి ఉందన్న విషయం ఎవరికీ తెలియలేదు, అలాగే “మహానటి”కి ముందు కీర్తి సురేష్ లో అంత గొప్ప నటీమణి దాగుంది అనే విషయం కూడా ఎవరికీ అర్ధం కాలేదు. కానీ.. ఆ సినిమాలు విడుదలయ్యాక వారి నట విశ్వరూపాలు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. తాజాగా అలా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన నటీమణి ఈశ్వరీరావు. దశాబ్ధకాలంగా సౌత్ సినిమాల్లో వర్క్ చేస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ ఆమెను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూశామే తప్ప నటిగా ఎన్నడూ గుర్తించలేదు, ఆమె నటనకు తగ్గ పాత్రనూ ఇవ్వలేదు.
కానీ.. నిన్న విడుదలైన “కాలా” చిత్రంలో ఈశ్వరీరావు నటన చూసినవాళ్ళందరూ నోరెళ్ళబెట్టారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ను తన స్క్రీన్ ప్రెజన్స్ & పెర్ఫార్మెన్స్ తో విశేషంగా ఆకట్టుకొంది. ఈశ్వరీరావు నటన చూసిన తెలుగు సినిమా దర్శకులు ఈమెనా తల్లి, పిన్ని పాత్రల కోసం సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వాడుకున్నామా అని బాధపడుతున్నారు. మరి ఇకనైనా ఈశ్వరిరావు నటనకు తగ్గ పాత్రలను మన దర్శకులు రాస్తారేమో చూడాలి.