ఇలా అయితే కుర్ర హీరోయిన్లను కూడా సైడేసేస్తుంది..!

ఈషా రెబ్బా ఈ పేరు అందరికీ సుపరిచితమే. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినా… ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘అంతకు ముందు ఆ ఆ తరువాత’ చిత్రంమే ఈమెకు హీరోయిన్ గా మొదటి చిత్రం. రెండో చిత్రం ‘బందిపోటు’ మూడో చిత్రం ‘అమీ తుమీ’ కూడా ఆయన డైరెక్షన్లోనే చేసింది. ఆ చిత్రాలు కూడా పర్వాలేదనిపించినా…దుకో ఈషా కు కలిసి రాలేదు. ఇక తరువాత చేసిన ‘దర్శకుడు’ ‘బ్రాండ్ బాబు’ చిత్రాలు కూడా ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. ఇక ‘అ!’ ‘అరవింద సమేత’ ‘సుబ్రహ్మణ్యపురం’ వంటి చిత్రాలు పర్వాలేదనిపించినా ఆమెకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు. మన తెలుగమ్మాయి .. చూడటానికి కళ కళలాడుతుంటుంది. అయినా ఈమెకు కమర్షియల్ చిత్రాల ఆఫర్లు రావడం లేదు.

eesha-rebba-bikini-show-in-her-next-film1

అయితే ఈషా స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకోకపోవడానికి.. కారణం గ్లామర్ పాత్రలకు ఆమె దూరంగా ఉండటమే అని ఇండస్ట్రీలో టాక్ ఉండనే ఉంది. ఇప్పటి హీరోయిన్ల పోటీని తట్టుకుని అవకాశాలు దక్కించుకోవాలంటే అందాలు ఆరబోత తప్పదు. అందుకే తన తదుపరి చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసేందుకు ఈషా రెబ్బా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ప్రస్తుతం డమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతుంది ఈషా. ‘రాగాల 24 గంటల్లో’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా ఇంట్రడక్షన్ సీన్లు బికినీలో ఉంటాయట. హీరోయిన్ గా ఒక్క కమర్షియల్ సినిమాలో నటించకపోయినా.. ఈషా క్రేజ్ ఓ రేంజ్లో ఉంది. ఇప్పుడు గ్లామర్ షో కూడా మొదలుపెడితే కుర్ర హీరోయిన్లను ఈషా సైడేసేసే అవకాశం ఉందనడంలో అతిశయోక్తి లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus