వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం సంప్రదించారు కానీ.. ఆమె కన్ఫర్మ్ చేయలేదు

  • August 26, 2019 / 12:48 PM IST

తెలుగమ్మాయి ఈషారెబ్బాకు “అరవింద సమేత” అనంతరం తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశం ఒక్కటీ రాలేదు. దాంతో ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు సైన్ చేస్తూ నెట్టుకొస్తుంది అమ్మడు. అయితే.. సినిమాలు లేకపోయినా ఇన్స్టాగ్రామ్ లో హాట్ ఫోటోలతో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలిచింది అమ్మడు. ఈ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఆమెను బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం సంప్రదించారట. సినిమాలు లేని టైమ్ లో ఇలాంటి షోకి వెళ్ళడం వల్ల పాపులారిటీ వచ్చినా క్రేజ్ తగ్గిపోతుందనే భయంతో వచ్చిన ఆఫర్ ను తిరస్కరించిందట ఈషారెబ్బ.

ప్రస్తుతం ఈషా తమిళంతోపాటు కన్నడ ఇండస్ట్రీ మీద చూపు మళ్లిస్తోంది. అన్నీ భాషాల నుంచి ఎంక్వైరీలు బాగానే వస్తున్నప్పటికీ.. “అరవింద సమేత” లాంటి సినిమా చేసిన తర్వాత తెలుగు నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో గుర్తింపు, ఆఫర్లు రాకపోవడం పట్ల బాధపడింది ఈషా. మరి అమ్మడి వ్యధను ఎవరైనా గుర్తిస్తారో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus