భారీ క‌లెక్ష‌న్స్‌తో రెండో వారంలో అడుగుపెట్టిన `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`

‘స్వామిరారా’, ‘కార్తికేయ‌’, ‘సూర్య vs సూర్య’ లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో హిట్స్ సాధించిన యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడుగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సోషియా థ్రిల్ల‌ర్ మూవీ `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`. హెబ్బాప‌టేల్‌, నందిత‌శ్వేత‌, అవికాగోర్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి.వెంక‌టేశ్వ‌ర‌రావు నిర్మించారు. న‌వంబ‌ర్ 18న విడుద‌లైన `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` విడుద‌లైన ఆట నుండి సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుని అమెరికా నుండి అన‌కాప‌ల్లి వ‌ర‌కు నిఖిల్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ను సాధించింది.

సినిమా విడుద‌లైన తొలి వారంలోనే 20 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను క‌లెక్ట్ చేసి నిఖిల్ సినిమాల్లో టాప్ చిత్రంగా నిలిచింది. యు.ఎస్‌లో సినిమా హాఫ్ మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్‌ను సాధించిన ఈ చిత్రం స‌క్సెస్‌ఫుల్‌గా రెండో వారంలో అడుగుపెట్ట‌డ‌మే కాకుండా మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌డానికి శ‌ర‌వేగంగా ప‌రుగులు తీస్తుంది. రెండోవారంలోకి ఎంట‌ర్ అవుతున్నా థియేట‌ర్స్ అన్నీ హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌, ద‌ర్శ‌కుడు ఆనంద్ టేకింగ్ నిర్మాత‌లు అన్‌కాంప్ర‌మైజ్‌డ్ మేకింగ్‌ల‌తో పాటు నిఖిల్ ఎక్స‌లెంట్ పెర్‌ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ థియేటర్స్‌లో బ్ర‌హ్మార‌థం ప‌డుతున్నారు. సినిమాకు వ‌స్తున్న రెస్పాన్స్‌, తిరుగులేని క‌లెక్ష‌న్స్‌తో నిఖిల్ `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాడ‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

క‌లెక్ష‌న్స్ వివ‌రాలు
నైజాం – 5,78, 46,728
సీడెడ్ – 1,40, 71, 126
ఈస్ట్ – 1,21,71,346
వెస్ట్ – 81,93,047
గుంటూర్ – 1,85,62,216
వైజాగ్ – 3,70,03,812
కృష్ణా – 1,05,00,000
క‌ర్ణాట‌క – 80,00,000
ఓవ‌ర్‌సీస్ – 3,64,00,000

Total : 20,27,48,275 (1st week worldwide gross)

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus