ఎన్టీఆర్ అభిమానులతో చప్పట్లు కొట్టించే ఎలక్షన్ సన్నివేశం

  • September 26, 2018 / 10:42 AM IST

ఎన్టీఆర్ తొలి సారి రాయలసీమ యాసలో మాట్లాడటం.. సిక్స్ ప్యాక్ లో కనిపించడం.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం.. చాలా రోజులకి పూర్తి మాస్ స్టోరీ ని ఎంచుకోవడం.. వంటి అంశాలు “అరవింద సమేత వీర రాఘవ” సినిమాపై అంచనాలను పెంచేసాయి. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి ఎస్ థమన్ అభూతమైన పాటలను అందించారు. ఆ పాటలు ప్రస్తుతం మారుమోగుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే నెల 11 న థియేటర్లో రానున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

ఈ సినిమాలో ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉందని తెలిసింది. అది ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని సమాచారం. ఎన్టీఆర్ తో ముడిపడిన స్థానిక ఎన్నికలకి సంబంధించిన సన్నివేశాన్ని అభిమానులతో చప్పట్లు కొట్టించే విధంగా త్రివిక్రమ్ చిత్రీకరించారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఓ వైపు యాక్షన్ సన్నివేశాలు .. మరోవైపు ఎమోషన్ సీన్స్.. వీటి మధ్యలో ఎన్నికల సీన్ కొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. బయటికి వస్తున్న వీడియోలు.. వార్తలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus