ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

విశ్వక్ సేన్ హీరోగా అభినవ్ గోమఠం, శివాత్మిక రాజశేఖర్, వెంకటేష్ కాకమాను, జీవన్, శ్రీనాథ్ మాగంటి వంటి స్టార్స్ అంతా అత్యంత కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఈ ఎన్ ఈ రిపీట్'(ENE Repeat). 2018లో వచ్చిన ‘ఈ ఎన్ ఈ'(ఈ నగరానికి ఏమైంది) చిత్రాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు. ‘పెళ్ళిచూపులు’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన యూత్ఫుల్ మూవీ ఇది. కేవలం యూత్ మాత్రమే కాదు ఓ సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఈ సినిమాకి ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి అనిపించుకోదు.

ENE Repeat

కామిడీతో పాటు ఎమోషన్ కి కూడా ఈ సినిమా ద్వారా కొత్త డెఫినిషన్ చెప్పాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అందుకే ఈ సినిమా స్లో పాయిజన్ మాదిరి మంచి అప్రీషియేషన్ పొందింది. బాక్సాఫీస్ వద్ద కూడా డీసెంట్ సక్సెస్ అనిపించుకుంది. కానీ ఓటీటీల్లో, రీ రిలీజ్లో ఈ సినిమాని వీక్షించిన వారి సంఖ్యనే ఎక్కువ అని చెప్పాలి. ఆల్మోస్ట్ 8 ఏళ్ళ నుండీ ‘ఈ ఎన్ ఈ’ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. మొత్తానికి వారి కోరిక మరో 2 రోజుల్లో తీరబోతోంది.

నవంబర్ 19న ‘ఈ ఎన్ ఈ రిపీట్’ చిత్రం విడుదల కానుంది. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి ‘ఈ ఎన్ ఈ రిపీట్’ స్పెషల్ షో వేసి చూపించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్, అలాగే నిర్మాత సుజన్ ఎరబోలు. అగ్ర నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు వంటి వారు ఈ స్పెషల్ షోని వీక్షించారట. అలాగే మిగిలిన వారు కూడా సినిమా చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉంటుందట.

‘ఈ ఎన్ ఈ’ రేంజ్..లో వన్ లైనర్స్ పేలినట్టు చెబుతున్నారు. సెకండాఫ్ లో కామిడీ కంటే ఎమోషన్స్ కి పెద్ద పీట వేశాడట దర్శకుడు. జెంజి ఆడియన్స్ కి అవి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ వంటివి మొదటి భాగంతో పోలిస్తే మరింత క్వాలిటీగా ఉన్నాయని చెబుతున్నారు. మరి ప్రీమియర్ షోలతో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus