బాలీవుడ్ బ్యూటీ బాంబు పేల్చింది!

  • September 2, 2016 / 05:46 AM IST

“స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య” వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ సాధించిన అనంతరం “శంకరాభరణం”తో డిజాస్టర్ ను చవిచూసిన నిఖిల్ కొంత విరామం అనంతరం “ఎక్కడికి పోతావు చిన్నవాడా” అని థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం “స్వామిరారా”తో తన కెరీర్ కు బూస్ట్ ను ఇచ్చిన సుధీర్ వర్మ దర్శకత్వంలో “స్వామి రారా”కి సీక్వెల్ గా రూపొందనున్న చిత్రంలో నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఇషా గుప్తా ఓ కీలకపాత్ర పోషించనుందని రెండ్రోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది.

అయితే.. తాజా సమాచారం ప్రకారం అసలు ఈ సినిమాలో ఇషా గుప్తా నటించడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియా ద్వారా “ఇషా గుప్తా తెలుగు సినిమా” అనే వార్త స్వయంగా ఇషా గుప్తా వరకూ చేరడంతో ఆమె స్వయంగా రంగంలోకి దిగి “నేను ఎటువంటి తెలుగు సినిమా అంగీకరించలేదు” అని ట్వీటింది. అసలే ప్రోజెక్ట్ గురించి నానా రకాలుగా అనుకొంటున్న సమయంలో ఇలాంటి ఫాల్స్ న్యూస్ రావడం సినిమాపై రాంగ్ ఇంపాక్ట్ చూపుతుంది. మరి ఇప్పటికైనా నిఖిల్ రంగంలోకి దిగి సినిమాకి సంబంధించి అఫీషియల్ స్టేట్ మెంట్ ఇస్తే బాగుంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus