బాహుబలి చూసినప్పట్నుంచి ప్రభాస్ తో యాక్ట్ చేయాలనుకొంటుందట.!

  • April 25, 2018 / 09:31 AM IST

ఒక్కోసారి కొన్ని ఆఫర్లు ఎందుకు మిస్ అవుతుంటాయో కూడా కొందరికి అర్ధం కావు. ఇండో జర్మన్ మోడల్ కమ్ యాక్ట్రెస్ ఎవ్లిన్ శర్మ త్వరలో ‘సాహో‘ సినిమాలో కీలకపాత్రతో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు పరిచయం కానున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు బాలీవుడ్ లో కథానాయికగా పెద్దగా పేరు తెచ్చుకోకపోయిన అమ్మడి ఎక్స్ పోజింగ్ కి సోషల్ మీడియాలో విపరీతమైన అభిమాన గణం ఉంది. అందుకే పెద్దగా నటనాచాతుర్యం లేకపోయినా అమ్మడు కెరీర్ ను నెట్టుకొచ్చేస్తుంది. ఈ అమ్మడికి మొదట సౌత్ నుంచి మహేష్ బాబు సినిమా కోసం అడిగారట, అప్పటికి డేట్స్ కుదరకపోవడంతో ఆ సినిమా వాదులుకోవాల్సి వచ్చిందట.

అయితే.. “బాహుబలి” సినిమా చూసినప్పట్నుంచి ప్రభాస్ తో కలిసి నటించాలని కలలు గంటోందట. ఊహించని విధంగా “బాహుబలి” అనంతరం ప్రభాస్ నటిస్తున్న “సాహో” చిత్రంలోనే ప్రభాస్ తో కలిసి నటించే అద్భుతమైన అవకాశం వరించడంతో ఆనందపరవసంతో తబ్బిబ్బవుతోంది ఎవ్లిన్ శర్మ. ఈ అమ్మడు త్వరలోనే మరిన్ని తెలుగు సినిమాల్లో నటించేందుకు సన్నాహాలు చేసుకొంటోందట. అమ్మడి అందానికి ఆఫర్లు క్యూ కట్టాల్సిందేమరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus