కృతి కర్బంధకూ తప్పని హాట్ ఫోటోషూట్స్, వైరల్ అవుతున్న హాట్ ఫోజులు

  • March 27, 2019 / 06:55 PM IST

కొవ్వొత్తి అన్నాక కరిగిపోవడం, అందం అన్నాక తరిగిపోవడం కామన్ అంశం. కానీ.. ఫిలిమ్ ఇండస్ట్రీలో అందం తగ్గిపోవడం అంటే సదరు హీరోయిన్ కెరీర్ ఖతం అన్నట్లే. అందుకే వయసు పైబడుతోన్నా.. ఇంకా తాము కన్యామణులమే, తమలో గ్లామర్ ఏమీ తగ్గలేదు, తమ ఒంపులు-సొంపులు సక్రమంగానే ఉన్నాయి అని ప్రూవ్ చేసుకోవడం కోసం నానా ఇబ్బందులు పడుతుంటారు. ఆ తంటాలు పాపం కృతి కర్బందాకు కూడా తప్పలేదు మరి. అప్పుడెప్పుడో “బోణీ” సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కృతికి తెలుగులో పెద్దగా అచ్చిరాలేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా నటించే అవకాశం దక్కించుకున్నప్పటికీ.. “తీన్ మార్” ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాలేదు.

దాంతో బాలీవుడ్ లోనే అడపాదడపా సినిమాలు చేస్తూ కెరీర్ ను నెట్టుకొస్తోంది కృతి. కానీ.. అమ్మడికి ఇంకా టాలీవుడ్ మీద మమకారం తగ్గలేదనుకుంటా.. అందుకే మళ్ళీ కొత్తగా ఒక హాట్ ఫోటోషూట్ చేయించుకుని మీడియాకి వదిలింది. ఆ ఫోటోలు చూసినవాళ్లందరు ఏమిటీ ఈ అమ్మాయి ఇలా అయిపోయింది అని షాక్ అవుతున్నారు. మరి కృతి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus