భీభత్సానికి ఇక సిద్దం!!!

  • April 26, 2017 / 05:52 AM IST

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ…బాహుబలి అనడంలో ఏమాత్రం సందేహం లేదు….గత ఏడాది బాహుబలి కోసం ఎంతమంది ఎంతగా ఎదురు చూసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఈ సినిమా కోసం కొన్ని వేల కళ్ళతో ఎదురు చూసిన అభిమానులు, సినిమా విడుదల సమయంలో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు…అయితే… సినిమా టికెట్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా…వేలకు వేలు పోసి కొని మరీ సినిమాను భారీ హిట్ చేశారు…ఇక ఇదిలా ఉంటే గత సంవత్సరం బాహుబలి చిత్రం రిలీజ్ కి ముందు సోషల్ మీడియాలో పెను సంచలనాలు సృష్టించారు బాహుబలి క్రియేటివ్ టీమ్…..సినిమాలోని క్యారెక్టర్స్ కి సంబంధించి ప్రతిరోజు ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ భీభత్సంగా పెంచేశారు…ఇదిలా ఉంటే తాజాగా బాహుబలి చిత్రానికి సీక్వెల్ బాహుబలి 2 ఏప్రిల్ 28 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.  ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

అంతే కాదు బాహబలి ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప తనకు ఎంతో ఇష్టమైన అమరేంద్ర బాహుబలిని ఎందుకు వెన్నుపోటు పొడిచాడు అన్న విషయం తెలుసుకోవాలని తెగ కుతూహలపడుతున్నారు. అయితే ఇదే క్రమంలో…అమరేంద్ర బాహుబలి మరో మూడు రోజుల్లో వస్తున్నాడంటూ బాహుబలి టీమ్ తాజాగా ప్రభాస్ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. అసాధ్యాలను దాటుకుని ఇక మీ ముందుకు వస్తున్నాడని తన ట్విటర్ లో పేర్కొంటూ కేరళలో 300 థియేటర్లలో ఈ చిత్రం విడుదల అవుతోందని తెలిపింది. ఇక ఇప్పటికీ అంచనాలు తారస్తాయికి చేరుకున్న తరుణంలో ఈ పోస్టర్ లోని న్యూ ప్రభాస్ ను చూస్తూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు…మరి రిసల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus