వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 4వ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో కూడా నటించే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుంది. కథ ప్రకారం వేరే హీరో అవసరం ఉందని భావించిన టీమ్ ఈ మేరకు పక్క భాషల హీరోలపై దృష్టి పెట్టింది. అందులో ముందుగా ఫహద్ ఫాజిల్(Fahadh Faasil) పేరు అనుకుంది. క్యారెక్టర్ కి అతనే పర్ఫెక్ట్ అని భావించింది.
అయితే ఊహించని విధంగా మధ్యలో తమిళ స్టార్ హీరో కార్తీ పేరు కూడా తెరపైకి వచ్చింది. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయ్యింది.ఆ హీరో బాగుంటుంది అని కొందరు.. ఈ హీరో అయితే బెటర్ అని ఇంకొందరు ఇలా సోషల్ మీడియాలో చర్చలు జరిపారు. ఫైనల్ గా ఫహద్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టు వినికిడి. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఫహద్ ఫాజిల్ ని కలిసి కథ గురించి అతని పాత్ర గురించి వివరించరాట.
అవి నచ్చడంతో ఫహాద్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పారితోషికం వంటి కమర్షియల్ వ్యవహారాలపై ఫహాద్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయ్యి అతను అగ్రిమెంట్ పై సైన్ చేస్తే.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.అయితే వెంకటేష్- అనిల్ రావిపూడి 4వ ప్రాజెక్టుని ఇంకా అధికారికంగా ప్రకటించింది లేదు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఫహాద్ గురించి ప్రకటన ఇవ్వొచ్చు.ఇక ఈ ప్రాజెక్టు కూడా 2027 సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.