నిత్యామీనన్ హగ్ చేసుకున్నది ఎవరా అని కంగారుపడుతున్న ఫ్యాన్స్

  • March 12, 2019 / 01:20 PM IST

ఇదివరకు తాము ఇష్టపడిన అమ్మాయిలు ఎవరైనా వేరే అబ్బాయితో కనబడితే వాళ్ళను ఇష్టపడే అబ్బాయిలు తెగ ఇదైపోయేవారు. ఈ ఇంటర్నెట్ కాలంలో అమ్మాయిల బదులు హీరోయిన్ల మీద మనసు పారేసుకుంటున్న యువత తాము ఇష్టపడిన హీరోయిన్ ఆమె నటించే హీరోతో కాకుండా వేరే ఎవరితోనైనా కనబడితే కుళ్లుకుంటున్నారు. రీసెంట్ గా అనుష్క కొత్త ఫోటోల్లో కనిపించిన ఆమె ఫిట్ నెస్ ట్రైనర్ విషయంలోనూ అదే జరిగింది. ఎవడాడు, ఎవడాడు నా సిస్టమ్ పక్కన అని గోల చేశారు అనుష్క హార్డ్ కోర్ ఫ్యాన్స్.


మళ్ళీ ఆ తరహా సమస్య నిత్యామీనన్ విషయంలో చోటు చేసుకుంది. ఇటీవల నిత్యామీనన్ తన స్నేహితులను కలుసుకొంది. వాళ్ళలో ఒక ఫారిన్ కుర్రాడు కూడా ఉన్నాడు. ఆ కుర్రాడ్ని నిత్యా ఘాడంగా హగ్ చేసుకున్నా ఫోటోను ఆమే స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పట్నుంచి నిత్యా ఫ్యాన్స్ అందరూ తెగ ఫీలైపోతున్నారు. ఆ కుర్రాడు ఆమెకు స్నేహితుడు మాత్రమేనని ఆమె పోస్ట్ ద్వారా కన్ఫర్మ్ అవుతున్నప్పటికీ కుర్రాళ్ళు మాత్రం ఒప్పుకోవడం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus