టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జాతిరత్నాలు ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా, తన నటనతో పాటు డాన్స్, హ్యూమర్ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఆమె, తాజాగా మీడియాతో మాట్లాడినప్పుడు తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి.
ఫరియా చెప్పిన వివరాల ప్రకారం, తన తండ్రి పుట్టుకతో హిందూ మతానికి చెందినవారని, తర్వాత జీవితంలో కొన్ని ఆలోచనలు మరియు సంఘటనల ప్రభావంతో ఇస్లాం మతాన్ని స్వీకరించారని తెలిపారు. అదే విధంగా తన తల్లి పుట్టుకతో ముస్లిం అని, ఆ తరువాత తాను హిందూ సాంప్రదాయాలకు దగ్గరైంది అని చెప్పుకొచ్చారు. అయితే తమ ఇంట్లో ఎలాంటి మత భేదాలు లేవని, అన్ని మతాల విలువలను గౌరవించే వాతావరణంలోనే పెరిగినట్టు స్పష్టం చేశారు.
“మాకు మతం కంటే మానవత్వమే ముఖ్యమని మా తల్లిదండ్రులు నేర్పించారు” అని ఫరియా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రేమ, గౌరవం, సాటి మనిషిని అర్థం చేసుకోవడం.. ఇవే జీవితంలో అసలైన విలువలు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే, ఫరియా ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలతో ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మొత్తానికి, తన వ్యక్తిత్వంతో పాటు తన ఆలోచనలతో కూడా ఫరియా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది.