Faria Abdullah: హనుమాన్ సినిమాని రిజెక్ట్ చేశాను.. నాకు బ్రెయిన్ లేదు : ఫరియా అబ్దుల్లా

Advertisement

టాలీవుడ్లో ఒక సామెత ఉంది.. ‘సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ పాఠాలు నేర్పిస్తుంది’ అని. కానీ ఒక్కోసారి ఆ సక్సెస్ ఇచ్చే ‘కిక్’ లో కళ్ళు కప్పేసి, ముందున్న అద్భుతమైన అవకాశాన్ని కూడా దూరం చేసుకునేలా చేస్తుంది. సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది మన ‘చిట్టి’ అలియాస్ ఫరియా అబ్దుల్లాకి.

Faria Abdullah

అసలేం జరిగింది? త్వరలో గాయ పడ్డ సింహం సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ..”నా కెరీర్ లో అతిపెద్ద రిగ్రెట్ ‘హనుమాన్’ సినిమాలో నటించకపోవడమే. అందుకు కారణం జాతి రత్నాలు సక్సెస్ ఎఫెక్ట్: ‘జాతి రత్నాలు’ సినిమా భారీ హిట్ అవ్వడంతో, తన దగ్గరికి వచ్చే ప్రతి కథను ఎలా జడ్జ్ చేయాలో తెలియని కన్ఫ్యూజన్ లో పడిపోయాను.ఆ కన్ఫ్యూజన్ లోనే ప్రశాంత్ వర్మ చెప్పిన ‘హనుమాన్’ స్క్రిప్ట్ లోని లోతును అంచనా వేయలేకపోయాను.నాకు అప్పుడు బ్రెయిన్ లేదు, అందుకే మిస్ అయ్యాను” అంటూ సెల్ఫ్ సెటైర్ వేసుకుంది ఫరియా.

నిజానికి, మన దగ్గర ఏదైనా మంచి వస్తువు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు.. అది చేజారిపోయాక వేరే వాళ్ళ చేతిలో మెరిసిపోతుంటే వచ్చే ఆ బాధ వర్ణనాతీతం. ఇప్పుడు ఫరియా పరిస్థితి కూడా అంతే! బయట ఏదైనా సినిమా ఈవెంట్లలో హీరో తేజ సజ్జ లేదా దర్శకుడు ప్రశాంత్ వర్మ కనిపిస్తే చాలు.. ఫరియాకి సినిమా కథ కంటే ఆ ‘మిస్డ్ కాల్’ (ఆఫర్) గుర్తొచ్చి నిద్రలేని రాత్రులు గడుపుతోందట. ఆమె రివీల్ చేసిన ఈ షాకింగ్ నిజం విని యాంకర్ సైతం ఎమోషనల్ అయ్యాడు. భవిష్యత్తులో అంతకు మించిన మంచి ఛాన్స్ వస్తుందేమో అంటూ హోప్ ఇచ్చే కామెంట్స్ చేశాడు. అది విషయం.

థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus