కొన్నేళ్లుగా విజయం కోసం ఎదురుచూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి, కూల్ డైరక్టర్ శేఖర్ కమ్ములకు ఫిదా మూవీ మంచి హిట్ ని అందించింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి కలక్షన్స్ సాధిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కేవలం ఏ సెంటర్ల ఆడియన్స్ మాత్రమేగాక బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లో (శుక్ర, శనివారాలు) 6.6 లక్షల డాలర్లను రాబట్టిన ఈ సినిమా ఆదివారంతో మిలియన్ డాలర్ క్లబ్లోకి చేరిపోయింది.
సోమవారం కూడా కలక్షన్స్ తగ్గక పోవడం విశేషం. ఇందులో సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఓవర్సీస్ లో త్వరలోనే రెండు మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరుతోందని ట్రేడ్ వర్గాలవారు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 9 .80 షేర్ వసూలు చేసి దూసుకుపోతోంది. ఏరియాల వారీగా కలక్షన్ల వివరాలు..
నైజాం 4.34 కోట్లు
సీడెడ్ 1.19 కోట్లు
ఉత్తరాంధ్ర 1.20 కోట్లు
గుంటూరు 0.81 కోట్లు
ఈస్ట్ 0.76 కోట్లు
వెస్ట్ 0.54 కోట్లు
కృష్ణ 0.66 కోట్లు
నెల్లూరు 0.29 కోట్లు
మొత్తం 9.80 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 1 . 90 కోట్లు
ఓవర్ సీస్ 6 .25 కోట్లు
మొత్తం షేర్ : 17 .95 కోట్లు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.