‘ఎన్ టి ఆర్ అవార్డ్స్’ తో ఎఫ్ టి పి సి ఇండియా వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ సాధించడం గర్వకారణం!!

  • June 2, 2023 / 02:27 PM IST

శక పురుషుడు ఎన్ టీ ఆర్ శత జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఐదువేలు పైబడి అంగరంగ వైభవంగా జరగడం, హైదరాబాద్ లో ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా వారు నిర్వహించిన వేడుక వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ కి ఎక్కడం చూస్తోంటే ఎంతో ఆనందం కలుగుతోంది” అని అన్నారు ప్రముఖ నటులు – మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్.

ఇంకా ఆయన మాట్లాడుతూ…”ఇంతటి వైభవం ఏ ఇతర నటుడికి దక్కదు అని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఒక్క హైదరాబాద్ లోనే ఆరోజు రెండు వందల వేడుకలు జరిగాయని తెలిసి, ‘ఇది కదా చరిత్ర’ అనిపించింది. వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ టార్గెట్ గా అంగరంగ వైభవంగా ఎన్ టీ ఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుక నిర్వహించి… పది రాష్ట్రాలకు చెందిన 101 సినీ సామాజిక ఆరోగ్య వ్యాపార ప్రముఖులను సత్కరించి ప్రపంచ రికార్డు ద్వారా అన్నగారి ఖ్యాతిని మరొక్కసారి యావత్ ప్రపంచానికి తెలియజేసిన ఎఫ్ టి పి సి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా, సెక్రటరీ వీస్ వర్మ పాకలపాటి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసి అవార్డును అందజేసిన వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ ఇండియా ప్రతినిధులు “రాజీవ్ శ్రీ వాత్సవ్, టీ ఎస్ రావు, ఆకాంక్ష షా”లకు నా ప్రత్యేక అభినందనలు” అన్నారు!!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus