తన సినిమా విషయంలో నిర్ణయం తీసుకున్న అల్లు అర్జున్!

  • October 20, 2018 / 07:10 AM IST

వరుసగా విజయాలు అందుకుంటుంటే ప్రయోగాలు చేయాడానికి దైర్యం వస్తుంది. అపజయాలు పలకరిస్తుంటే కొత్త కథతో ముందుకెళ్లాలంటే భయం వేస్తుంది. అటువంటి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. అతని గత చిత్రాలు రెండూ సంతృప్తికరమైన విజయాన్ని ఇవ్వలేకపోయింది. తోటి హీరోలు ఇండస్ట్రీ హిట్స్ సాధిస్తున్నారు. ఈ సమయంలో ఎలాగైనా పక్కా కమర్షియల్ మూవీ చేయాలి. అందుకే త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్టు తెలిసింది. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న సమయంలో బన్నీకి ఓ కథ వినిపించారంట. కథ నచ్చినప్పటికీ అరవింద ఫలితం తర్వాత మాట్లాడుకుందామని అల్లు అర్జున్ చెప్పినట్టు టాక్.

ఈ మూవీ బ్లక్ బస్టర్ హిట్ సాధించడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి ఇప్పుడు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది వరకు వీరిద్దరి కలయికలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఇవి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మూవీ ఉంటుందని సమాచారం. ఆ తర్వాత సుకుమార్ తోను చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ ఏమైనా ఆలస్యమైతే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూవీని పట్టాలెక్కించడానికి బన్నీ సిద్ధంగా ఉన్నట్టు టాక్. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus