వచ్చే ఏడాది అమీ జాక్సన్ పెళ్లి ఫిక్స్, షాక్ లో జనాలు

  • September 25, 2019 / 07:19 PM IST

బ్రిటిష్ నటి అమీజాక్సన్ కు సౌత్ లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో రెండు సినిమాల్లో నటించిన అమీ జాక్సన్ తెలుగులోనూ “ఎవడు” సినిమాలో మెరిసింది. “రోబో 2.0” తర్వాత అమీ మరో తెలుగు కానీ తమిళ ప్రొజెక్ట్ కానీ సైన్ చేయలేదు. ఇటీవల ఆమె తాను జన్మనిచ్చిన పండంటి మగబిడ్డతో ఫోటో పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే.. ఇప్పుడు జనాలు ఆమెకు బిడ్డ పుట్టినడానికంటే.. ఆమెకు ఇంకా పెళ్లి అవ్వలేదనే విషయం గురించి ఎక్కువగా షాక్ అవుతున్నారు.

విషయం ఏంటంటే.. అమీ జాక్సన్ ఎంగేజ్ మెంట్ మాత్రమే చేసుకొంది. ఇప్పటివరకూ వాళ్ళకి పెళ్లవ్వలేదు. ఇప్పుడు వచ్చే ఏడాది నా పెళ్లి అని పిల్లాడ్ని ఒడిలో పెట్టుకొని ప్రకటించేసరికి జనాలకు ఏమీ అర్ధం కాలేదు. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా కామన్ కాబట్టి అక్కడ పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. మన నెటిజన్లు మాత్రం.. వచ్చే ఏడాది అమీ ఆమె బిడ్డతో కలిసి పెళ్లి చేసుకోబోతోందన్నమాట అని తెగ ఆశ్చర్యపోతున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus