ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్ నటించనున్నారా?

  • August 7, 2018 / 03:36 PM IST

డైరక్టర్ క్రిష్ ఆలోచనలు ఊహకి అందకుండా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అయితే రోజుకో ఆశ్చర్యకరమైన వార్త బయటికి వస్తోంది. బాలకృష్ణ ఎన్టీఆర్ గా నటిస్తున్న ఇందులో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రని బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ పోషిస్తోంది. ఇక రెండో భార్య లక్ష్మి పార్వతి కోసం అలనాటి హీరోయిన్ ఆమనిని తీసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావ్ పాత్రలో సుమంత్,  హరికృష్ణ గా కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ అల్లుడు, నేటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గా దగ్గుబాటి రానా అదరగొట్టనున్నారు. ఇప్పటికే అనేకమంది హీరోలతో నిండిపోతున్న ఈ మూవీకి మరో ప్రధాన బలం తోడుకానుంది. ఆ బలమే ఎన్టీఆర్.

బాలకృష్ణ పాత్రను పోషించమని క్రిష్ ఎన్టీఆర్ ని కోరినట్లుగా ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. బాబాయ్ కి అబ్బాయికి మధ్య కొంత దూరం ఉన్నప్పటికీ తాత బయోపిక్ లో భాగం కావాలని తారక్ ఉన్నట్టు సమాచారం. అందుకే బాబాయ్ పాత్రను పోషించడానికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గానీ.. నిజమయితే నందమూరి అభిమానులకు మాత్రం ఇది ఆనందించదగ్గ వార్తే. ప్రస్తుతం ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మధ్య జరిగే సన్నివేశాలను చిత్రీకరించారు. వచ్చే నెల రానా కంటికి ఆపరేషన్ కారణంగా ఈనెలలోనే రానా సీన్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి బాలయ్య నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి బరిలోకి దిగనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus