ఫస్ట్ ఇంపాక్ట్ అంటే ఫస్ట్ లుక్ కాదట

  • December 30, 2017 / 06:29 AM IST

సబ్జెక్ట్స్ పరంగా ఎక్స్ పెరిమెంట్స్ చేయకపోయినా క్యారెక్టర్స్ విషయంలో, లుక్స్ పరంగా మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ “స్టైలిష్ స్టార్” అనే బిరుదును సార్ధకం చేసుకొంటున్న అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య” సినిమాలో మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన “ఫస్ట్ ఇంపాక్ట్”ను జనవరి 1న విడుదల చేయనున్నారని ఎనౌన్స్ చేసిన చిత్ర బృందం.. అది ఫస్ట్ లుక్కా లేక టీజరా అనే విషయం మాత్రం చెప్పలేదు.

అయితే.. సినిమాలో అల్లు అర్జున్ లుక్ ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఆల్రెడీ జనాలకి ఒక ఐడియా వచ్చేయడంతో ఏదో ఒక ఫోటోను “ఫస్ట్ లుక్” పేరుతో రిలీజ్ చేయడం కంటే ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట టీం. సో, జనవరి 1న అల్లు అర్జున్ అభిమానులు ఫస్ట్ లుక్ స్టిల్స్ తోపాటు టీజర్ తో పండగ చేసుకోవచ్చన్నమాట. శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయాలనుకొన్నప్పటికీ.. త్వరలోనే రిలీజ్ డేట్ లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus