ప్రభాస్ నటనకు ఫ్రాన్స్ వాళ్లు ఫిదా

  • June 21, 2016 / 12:38 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నటనతో లోక ప్రజలను మెప్పిస్తున్నారు. అతను నటించిన బాహుబలి విడుదలై ఏడాది కావస్తున్న విజయ పరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఏ దేశంలో రిలీజ్ అయినా అభినందనలను అందుకుంటోంది. రీసెంట్ గా బాహుబలి – ది బిగినింగ్ ప్రాంతీయ భాషల్లో అనువాదమై ఫ్రాన్స్ లో విడుదల అయింది. ఈ చిత్రాన్ని జక్కన్న రాజమౌళి మలిచిన తీరు చూసి అక్కడి వారు స్టన్ అయిపోయారు.

వీరోచిత సన్నివేశాల్లో ప్రభాస్ నటనకు ఫ్రాన్స్ సినీ ప్రియులు జోహార్లు పలికారు. సినిమా పూర్తి కాగానే థియేటర్ లోని 14 వందల మంది ఒక్కసారిగా లేచి రెబల్ స్టార్ ను చప్పట్లతో అభినందించారు. బాహుబలి కంక్లూజన్ కోసం తాము కూడా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడడంతో బాహుబలి – కంక్లూజన్ ను అభిమానుల అంచనాలకు మించి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఒకే సారి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus