‘సరిలేరు నీకెవ్వరు’ సాంగ్ గురించి భయపడుతున్న ఫ్యాన్స్…!

  • December 5, 2019 / 05:41 PM IST

మహేష్ బాబు ఫ్యాన్స్ కు పండగ లాంటి న్యూస్ చెప్పారు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్ సభ్యులు. విషయం ఏమిటంటే.. డిసెంబర్ నెలలో ఉన్న ఐదు సోమవారాలు ఐదు లిరికల్ సాంగ్స్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. టీజర్ విడుదల చేసే వరకూ ప్రమోషన్స్ అంతంత మాత్రమే చేస్తూ వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు సడన్ గా స్పీడ్ పెంచారనే చెప్పాలి. డిసెంబర్ 2న అంటే సోమవారం రోజున ఫస్ట్ సింగల్ విడుదల కాబోతుంది. ప్లానింగ్ బాగానే ఉంది కానీ మహేష్ అభిమానులకు మాత్రం టెన్షన్ పట్టుకుందట.

దానికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ గత చిత్రమైన ‘మహర్షి’ కి దేవి శ్రీ ప్రసాద్ ఆశించిన స్థాయిలో సంగీతం అందించలేకపోయాడు. ఇక తాజాగా విడుదల చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ కు కూడా దేవి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో మొదటి పాట ఎలా ఉంటుందో అన్న టెన్షన్ వారిలో మొదలైందని తెలుస్తుంది.  మరి దేవి మెప్పిస్తాడా అనేది చూడాల్సి ఉంది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus