అల్లరోడు మేడెక్కి కబుర్లు చెప్పేది ఆమెకే

  • September 4, 2017 / 06:24 AM IST

హెడ్డింగ్ చూసి మోహన్ బాబు కూతురేమిటి, అల్లరి నరేష్ గర్ల్ ఫ్రెండ్ ఏమిటి అని వీరాలెవల్లో ఆలోచించేస్తూ బుర్రకి పనిపెట్టేయకండి.. ఇక్కడ మోహన్ బాబు కూతురంటే ఆయన ఆఫ్ స్క్రీన్ డాటర్ మంచు లక్ష్మీ కాదు, ఆన్ స్క్రీన్ డాటర్ గా నటిస్తున్న నిఖిలావర్మ. ఈ మలయాళ ముద్దుగుమ్మ అల్లరి నరేష్ సరసన “మేడ మీద అబ్బాయి” సినిమాతో తెలుగుతెరకు పరిచయమవుతుంది. అలాగే.. మోహన్ బాబుతో కలిసి “గాయత్రి” అనే చిత్రంలోనూ నటిస్తుందట ఈ అందమైన అమ్మాయి.

ఇకపోతే.. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న అల్లరి నరేష్ కూడా “మేడ మీద అబ్బాయి” సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఓ తమిళ సినిమాకి రీమేక్ అవ్వడంతోపాటు.. ట్రైలర్, సాంగ్స్ కు మంచి స్పందన లభించడంతో సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో.. “యుద్ధం శరణం” అనే నాగచైతన్య సినిమాకి పోటీగా విడుదలవ్తున్నా ఎలాంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉన్నాడు అల్లరి నరేష్. చూద్దాం.. మరి అల్లరోడి నమ్మకం ఏమేరకు నిలబడుతుందో.. హీరోయిన్ గా నిఖిలావర్మకు తెలుగులో ఎలాంటి ఎంట్రీ లభిస్తుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus