గణేష్ దందా మస్త్ నడుస్తుందిలే…!

  • October 9, 2019 / 09:52 PM IST

’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 20 న విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. వరుణ్ తేజ్ మాస్ అవతార్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇక మొదటి మూడు రోజులకు గానూ ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి.

గద్దలకొండ గణేష్‘ మొదటి మూడు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 4.83 cr
సీడెడ్ 2.05 cr
ఉత్తరాంధ్ర 1.63 cr
ఈస్ట్ 1.07 cr
వెస్ట్ 0.97 cr
కృష్ణా 1.06 cr
గుంటూరు 1.23 cr
నెల్లూరు 0.52 cr
ఏపీ + తెలంగాణ 13.36 cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.02 cr
ఓవర్సీస్ 1.21 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 15.77 cr (షేర్)

‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి 25 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి 3 రోజులకి గానూ ఈ చిత్రం 15.77 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 10 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బి,సి సెంటర్స్ లో ఈ చిత్రానికి బుకింగ్స్ చాలా బాగున్నాయి. ఇక ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈ సోమవారం నుండీ మొదలు కానుంది. వీక్ డేస్ లో ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి..!

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
బందోబస్త్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus